bhasksr_4u
hai all plz share my moments
Tuesday, June 20, 2006
Wednesday, June 07, 2006
తెలుగు చిత్రాల వివరాలు
హలో,
నమస్కరమ0డి మీ కోసమ్ నెను అ0దిస్తున్న తెలుగు సినీ పరిశ్రమ వివరాలు మరి అదుకోడి.
www.telugupeople.com
www.filmchamber.com
www.greatandhra.com
www.totaltolywood.com
www.teluguveera_levara blogspot.com
www.telupu.com
ఇ0కా చాలా ఉన్నయి లె0డి కొద్ది కొద్ది గ పరిచయ0 చెస్తాను.
ఈ సారికి ఇతటితో సరిపెట్టుకోడి.
ఇట్లు
తమ విధెయుడు
T.భాస్కర్
Wednesday, May 31, 2006
punya kshetram chusoddam randi(విషయ సూచిక [hide]
తిరుమల
చేరుకొను విధము
కాలి నడకన
తిరుమల గుడికున్న ఓ ప్రాముఖ్యత "కాలినడక"! తిరుపతి నుండి పైన కొండలమీద ఉన్న తిరుమల పట్టణానికి చేరడానికి కొడపైన కాలినడక కోసం మెట్లదారి ఉన్నది, భక్తులు ఈ దారిగుండా వెళ్ళి స్వామి వారిని దర్శించుకోవడం ఒక మ్రొక్కుగా భావిస్తారు। తిరుమలకి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కాలిబాటలు ఉన్నవి అని పెద్దలు చెపుతూ ఉంటారు। ప్రస్తుతము మాత్రము రెండు ఎక్కువ వినియోగములో ఉన్నవి, మూడవది, కడప జిల్లా నుండి ఉన్నది కూడా వినియోగములో ఉన్నది అని విన్నాము, కాని వివరములు పెద్దగా తెలియదు।
అలిపిరి కాలిబాట
ఇది ఎక్కువ ప్రఖ్యాతిగాంచిన కాలిబాట దానికి కారణం ఇది తిరుపతి పట్టణము నుండి ఉండటము, మరియు తిరుమల తిరుపతి దేవస్థానముల వారు దీనిని బాగుగా అభివృద్దిచేయడము అనుకుంట। బస్సుద్వారా గాని, రైలు ద్వారాగాని తిరుపతి చేరుకున్న తరువాత మీరు అక్కడనుండి తిరుమల తిరుపతి దేవస్థానములు వారు నడుపుతున్న ఉచిత బస్సుద్వారా, లేదా ఆటో ద్వారా (ప్రస్తుతము ౨౦ రూపాయలు అవుతున్నది), లేదా ప్రయివేటు బస్సు ద్వారా (౪ రూపాయలు ప్రస్తుత చార్జీ), లేదా టాక్షీ/జీపు ద్వారాగాని ఈ కాలిబాటవద్దకు చేరుకొనవచ్చు।
అక్కడ సాధారణముగా కర్పూరములు కొని (ఏడు కొండలకు ఏడు అని అమ్ముతుంటారు), దారి ప్రారంభంలో ఉన్న వేంకటేశ్వరుని పాదాల గుడి దర్శనం చేసుకోని నడక కొనసాగిస్తూ దారిలో ఉన్న ఆంజనేయస్వామి చిన్న చిన్న మందిరములు దర్శిస్తూ నడుస్తారు! మీరు మంచి శరీరదారుడ్యముగలవారు అయితే రెండుగంటలు లేదా అంతకు తక్కువ సమయములో, ఓ మాదిరిగా అయితే మూడుగంటలలో మరీ చిన్నగా నడుస్తూ ప్రతి పదిమెట్లకీ ఆగుతూ ఉంటే ఐదు గంటల సమయము పడుతుంది కొండచేరుకోవడానికి। ఈ మెట్లదారి సుమారుగా తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది।
మొదటిసారి నడవాలి అని అనుకునేవారికి కొన్ని సలహాలు,
నెమ్మదిగా నడవండి, పరుగెత్తవద్దు, పరుగెత్తితే తొందరగా అలసిపోతారు।
సాధ్యమైనంతవరకు మొదటి గంట ఎక్కడా కూర్చొనవద్దు, కూర్చోకుండా నెమ్మదిగా నడిస్తే మొదటి గంటలో మెట్లన్నీ అయిపొయ్యి సాధారణ రోడ్డులాంటి దారికి వెళ్తారు, ఇహ అక్కడ నుండి మోకాళ్ళ మంటపము వరకు మెట్లు ఉండవు, ఉన్నా ఒకటీ అరా ఉంటాయి।
మెట్లకి ఇరువైపులా ఉన్న అంగడులలో ఉన్న పానియములు, తినిబండారములు తక్కువ తీసుకొనండి। సాద్యమైనంతవరకు గ్లూకోను డీ, నీరు లపై ఆధారపడండి, ముఖ్యముగా కూల్ డ్రింకులు ఏ విధముగానూ మన నడకకు సహకరించవు।
లగేజీలో విలువైన వస్తువులు లేకుండా చూసుకొనండి, లగేజి ని క్రింద ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానముల ఉచిత సేవలో పైకి పంపించండి।
[మార్చు]
శ్రీవారి మెట్టు కాలిబాట
తిరుమల చేరుకోవడానికి ఇది రెండవ ప్రఖ్యాతి వహించిన కాలిబాట। తిరుమల పట్టాణానికి కళ్యాణీ డ్యాము నీరు సరఫరాకి ఈ మార్గము నుండి పైపులైను వేసిన తరువాత నుండి ఈ దారి కొంత అభివృద్ది చెందినది। అలాగే తిరుమల తిరుపతి దేవస్థానములువారు ఈ కాలిబాటను కూడా బాగుగా అభివృద్ది చేస్తున్నారు। దీనికీ, అలిపిరి కాలిబాటకు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే అలిపిరి కాలిబాట మొత్తం సుమారుగా ౯ కిలోమీటర్లు ఉంటే ఈ కాలిబాట సుమారుగా మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది। అయితే ఈ కాలిబాటతో సమస్య ఏమిటంటే దీనికి చేరుకోవడానికి రవాణా సౌకర్యములు ఎక్కువగా లెవ్వు। ఈ దారిగుండానే వేంకటేశ్వరుడు వివాహానంతరం ఆరు నెలలు కాలురుఅగస్త్యేశ్వర స్వామి సన్నిదిలో గడిపి తరువాత తిరుమల చేరుకున్నారు।
ఆంధ్ర ప్రదేశు రోడ్డు రవాణా సంస్థవారు ఇక్కడకు తిరుపతి నుండి, చంద్రగిరి, శ్రీనివాస మంగాపురం ల మీదుగా ఒక బస్సు నడుపుతున్నారు। లేదా మీరు శ్రీనివాస మంగాపురం చేరుకొని అక్కడనుండి ఆటో లో వెల్లవచ్చు। శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టు సుమారుగా ౬ కిలోమీటర్లు ఉంటాయి। లేదా మీకు ఓపిక ఉంటే శ్రీనివాసమంగాపురం నుండే నడచి వెళ్ళవచ్చు।
